← 输入框|te.wikipedia.org|刷新
Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,30,089 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట

విహరణ • విశేష వ్యాసాలు • అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
శ్రీరంగం

శ్రీరంగం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి నగరంలోని ఒక ప్రాంతం. ఇది ఒక నదీ ద్వీపంగా ఏర్పడింది. శ్రీరంగానికి దక్షిణాన కావేరి నది, ఉత్తరాన దాని పాయ అయిన కొల్లిడం నది సరిహద్దులుగా ఉన్నాయి. విష్ణువు ఆలయాలకు సంబంధించిన 108 దివ్యదేశాలలో మొదటిదిగా పరిగణించబడే శ్రీరంగం, రంగనాథస్వామి ఆలయం కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆలయ సముదాయం, ప్రపంచంలోనే అతిపెద్ద నిరంతరం పూజలు జరిగే హిందూ దేవాలయం. శ్రీరంగంలో శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ప్రజలు గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో ఈ ప్రాంతాన్ని తిరువరంగం లేదా తరచుగా అరంగం అని పేర్కొన్నారు. తమిళ సాహిత్యంలోని ఐదు మహాకావ్యాలలో ఒకటైన శిలప్పదికారం లో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించారు. ఈ కావ్యంలో కోవలన్ ఒక బ్రాహ్మణుడిని కలుసుకుని, అతను ఉరైయూర్ కు రావడానికి కారణమేమిటని అడుగుతాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఇలా సమాధానమిస్తాడు: "తన వక్షస్థలంపై లక్ష్మిని ధరించి, వేయిపడగల సర్పంపై శయనిస్తున్న విష్ణువు మహిమను నా కళ్లతో చూడాలనే కోరికను తీర్చుకోవడానికి నేను వచ్చాను. అనేకమంది భక్తులు ప్రార్థనలతో ఆరాధించే ఆ విష్ణువు, కావేరి నది విస్తరిస్తున్న అలల మధ్య ఉన్న ఒక ద్వీపంలోని ఆలయంలో కొలువై ఉన్నాడు. ఆ దృశ్యం, ఎత్తైన బంగారు పర్వతమైన మేరువు వాలులపై నీలిమేఘాలు విశ్రమిస్తున్నట్లుగా ఉంది." శిలప్పదికారంలో శ్రీరంగం గురించి మరికొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. అలాగే అకనానూరు లోని 137వ పద్యంలో కూడా ఈ ప్రాంతం గురించి ప్రస్తావన ఉంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... వైష్ణవాచార్యుడు శ్రీపాదరాజ ను హరిదాసు ఉద్యమ స్థాపకుడిగా పరిగణిస్తారనీ!
  • ... సావో టోమ్ ఆఫ్రికాలోని అత్యంత పురాతన వలస పాలనా నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుందనీ!
  • ... తమిళ తీరప్రాంత పట్టణమైన వేలాంకన్ని ప్రపంచ ప్రసిద్ధ క్రైస్తవ క్షేత్రాల్లో ఒకటనీ!
  • ... ప్యాలెస్ ఆన్ వీల్స్ రాజస్థాన్ పర్యాటక సంస్థ, భారతీయ రైల్వేతో కలిసి నిర్వహిస్తున్న విలాసవంతమైన రైలు అనీ!
  • ... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత 1991లో జరిగిన అమేథి లోక్‌సభ ఉపఎన్నికలలో విజయం సాధించింది తెలంగాణ ప్రాంతానికి చెందిన సతీష్ శర్మ అనీ!
చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 27:
ఈ వారపు బొమ్మ
పుణ్యధామ్ ఆశ్రమంలో శివపరివారం

మహారాష్ట్ర పూణేలోని పుణ్యధామ్ ఆశ్రమంలో శివపరివారం

ఫోటో సౌజన్యం: Abbey kershaw
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.